28-03-2025 12:06:55 AM
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరు: కర్ణాటకలో నందిని పాలు, పెరుగుపై లీటర్‌కు ఏకంగా రూ. 4 చొప్పున పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల ధరలను పెంచడంపై చర్చించినట్టు మంత్రి కె.వెంకటేశ్ తెలిపారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని బ్రాండ్ పాలు, వాటి ఉత్పత్తులపై రూ. 5 పెంచాలంటూ డిమాండ్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లలో కేఎమ్‌ఎఫ్ పాల ధరలు ఇంత ఎక్కువ మొత్తంలో పెంచడం ఇదే తొలిసారి.