లక్షేట్టిపేట (విజయక్రాంతి): అగ్రి ఎంప్లాయిస్ నూతన మండల అధ్యక్షుడిగా నంది తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ గా సుద్ద పెల్లి వేణుగోపాల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివారం ఐబి ఆవరణలో నిర్వహించిన సమావేశంలో అగ్రి సంఘం సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా అగ్రి ఎంప్లాయిస్ మండల అధ్యక్షుడు నంది తిరుపతి మాట్లాడుతూ... నాపై నమ్మకంతో ఈ భాధ్యతను అందించిన సభ్యులందరికీ దన్యవాదాలు తెలియజేశారు. ఈ పదవితో నాకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. అగ్రి ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం కోసం శయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ సుద్ద పెల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ.. నాకు ఈ పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రి ఎంప్లాయిస్ సలహాదారు రామన్న, బీమేష్, కలల రమేష్, కోన రవిందర్, మాజి అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్, సత్యం, సురేష్, శ్రీనివాస్, పవన్, ప్రశాంత్, సుధాకర్, శ్రీనివాస్, కుమార్, రాజేందర్, కార్తిక్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.