నేషనల్ ఫెడరేషన్ కప్
భువనేశ్వర్: తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని నేషనల్ ఫెడరేషన్ కప్‌లో సత్తా చాటింది. హెప్టాథ్లాన్ విభాగంలో నందిని స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్‌లో కాంస్య పత కం సాధించిన నందిని.. తాజా గేమ్స్‌లోనూ అదే జోరు కొనసాగించింది. 100 మీటర్ల హర్డిల్స్, హై జంప్, షాట్‌పుట్, 200 మీట ర్లు, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 800 మీట ర్ల పరుగుతో కూడిన అతి క్లిష్టమైన హెప్టాథ్లాన్‌లో నందిని అగ్రస్థానంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా సాగుతున్న నందిని.. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తోంది.
తాజా విజయంపై నందిని స్పందిస్తూ.. ‘ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం నెగ్గ డం చాలా ఆనందంగా ఉంది. ఇది జోరు మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాననే నమ్మకముంది’ అని చెప్పింది. ఇక మరోవైపు పోల్ వాల్ట్ విభాగంలో తమిళనాడుకు చెందిన రోసీ మీనా పాల్‌రాజ్ బంగారు పతకం దక్కించుకుంది. రోసీ పోల్ 4.05 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం ఖాతాలో వేసుకుంది.