calender_icon.png 18 January, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత బాంధవుడు నంది ఎల్లయ్య

08-08-2024 03:26:43 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): స్వర్గీయ నంది ఎల్లయ్య దళిత బాంధవుడు అని, మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన నేత అని ఆయన సోదరుడి కుమారుడు నంది శ్రీహరి అన్నారు. ఎల్లయ్య ఐదు సార్లు సిద్దిపేట, ఒకసారి నాగర్‌కర్నూల్ ఎంపీ గా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని చెప్పారు. ఎల్లయ్య రాజకీయ వార సత్వాన్ని తాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా, నంది శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం, 2024లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిసి 2025లో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. వారు, సీఎం రేవంత్‌రెడ్డి తన అభ్యర్థిత్వంపై సానుకూలంగా స్పందించినట్లు శ్రీహరి తెలిపారు.