calender_icon.png 16 January, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట కళాకారులకు నంది అవార్డులు

16-01-2025 01:00:38 AM

సిద్దిపేట, జనవరి 15 (విజయక్రాంతి):  తెలుగు వెలుగు నంది పురస్కారాల మహోత్సవం 2025 లో తాము పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని అవార్డు గ్రహీతలు మహమూద్ పాషా, సంతోష్ తెలిపారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

ఈనెల 11న వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ త్యాగరాయ గాణ సభలో తమకు అవార్డులు వచ్చాయని తెలిపారు. మహమూద్ పాషా కు రచయితగా, యక్షగానంలో సంతోష్ కు పురస్కారం వచ్చిందన్నారు. తమతో పాటుగా గంగిరెద్దుల విన్యాసంలో గంగిరెద్దుల కళాకారుడు కనకయ్యకు తెలుగు వెలుగు పురస్కారం, ప్రశంసా పత్రాలు అందించారన్నారు.

తెలంగాణ ఉద్యమం నుండి వివిధ రంగాల్లో కృషి చేస్తున్న తమకు ఇప్పటికైనా గుర్తింపు రావడం, అందులో సిద్దిపేట ప్రాంత కళాకారులకు మూడు అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ ప్రతిభను గుర్తించి అవార్డులు అందించినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదిక సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు.