నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అప్పుడు, ఇప్పుడు అంటూ కొన్ని సంవత్సరాలు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందని.. ప్రశాంత్ వర్మ ఆయనను డైరెక్ట్ చేస్తారని.. అక్క తేజస్విని, చెరుకూరి సుధాకర్లు సంయుక్తంగా నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ఇంకేముంది అంతా ఓకే అయ్యారు కాబట్టి షూటింగ్ నేడో, రేపో ప్రారంభం కావొచ్చని అంతా భావించారు.
అయితే ఇది జరిగి కూడా నెలలు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో అవన్నీ కట్టుకథలేనని జనం ఫిక్స్ అయ్యారు. ఈ తరుణంలో మరో అప్డేట్ బయటకు వచ్చింది. డిసెంబర్ 5న ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ చిత్రానికి ముహూర్తం ఖరారైందని.. సినిమా పూజా కార్యక్రమాలు ఆ రోజునే ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే కొడుకు సినిమా పూజా కార్యక్రమాలను బాలకృష్ణ సింపుల్గా నిర్వహిస్తారో లేదంటే ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథుల్ని పిలిచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో చూడాల్సి ఉంది.