15-02-2025 09:38:05 AM
హైదరాబాద్: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్(basavatarakam hospital) ప్రారంభం అయింది. పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ను ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) శనివారం ప్రారంభించారు. బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని బాలకృష్ణ తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. ఏపీలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ప్రారంభిస్తామని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్(Basavatarakam Cancer Hospital Chairman) బాలకృష్ణ ప్రకటించారు.
పీడియాట్రిక్ వార్డు, ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందని బాలకృష్ణ(Balakrishna) పేర్కొన్నారు. క్యాన్సర్ తో ఎంతో మంది బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని చెప్పారు. ఆర్థిక స్థోమత లేని వారికి వైద్యం అందించడమే తమ లక్ష్యమని బాలయ్య పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. తమన్ ను మరోసారి నందమూరి తమన్ గా బాలకృష్ణ పిలిచారు. తమన్ తనకు తమ్ముడితో సమానమన్నారు. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులోనూ తమ ప్రయాణం ఇలానే కొనసాగుతోందని బాలయ్యబాబు స్పష్టం చేశారు.