రామ్ చరణ్ , కియారా అద్వాణి జంటగా రూపొందించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌ను అందుకుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. శంకర్ తన గత సినిమాల్లో మాదిరిగానే ప్రతీ పాటకు ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ పాటల్లో ‘నానా హైరానా’ పాట సమ్‌థింగ్ స్పెషల్. ఈ పాట ఫుల్ వీడియో తాజాగా విడుదలైంది. దీనిని ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించారు.
దేశంలో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో రూపొందిన తొలి పాట ఇదే కావడం గమనార్హం. ఈ పాట కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చైందట. ఈ పాట అంతా కూడా చాలా అద్భుతమైన విజువల్స్ మనకు కనిపిస్తాయి. ప్రత్యేకంగా కలర్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట ఇటీవల వచ్చిన ది బెస్ట్ మెలోడీస్‌లో ఒకటి కావడం విశేషం. దీనికి రామజోగయ్య శాస్త్రి చాలా మంచి సాహిత్యం అందించారు. ఈ పాట మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంగ్లీష్ పదం అనేది లేకుండా అచ్చ తెలుగులో ఈ పాటంతా రాయడం జరిగింది. ఇక ఈ పాటకు థమన్ ఇచ్చిన ట్యూన్ మరో హైలైట్.