calender_icon.png 24 November, 2024 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసికందు కిడ్నాప్ సుఖాంతం

24-11-2024 02:04:45 PM

ఆరు గంటల్లో పసికందు ఆచూకి

అరుగురి కిడ్నాపర్లు పట్టుకోవడం లో గద్వాల పోలీసుల కిలక పాత్ర

కిడ్నాపర్లు అరెస్ట్.. నాంపల్లి పోలీసులకు అప్పగింత

గద్వాల,(విజయక్రాంతి): పసి కందు ఆరోగ్యం బాగాలేదని నీలోఫర్ ఆసుపత్రి కీ వెళ్లి చికిత్స అందిస్తున్న తరుణంలో ఆసుపత్రి సిబ్బంది అంటూ పసికందు తల్లికీ మాయ మాటలు చెప్పి పసికందుతో పారిపోయిన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.  పసికందు మిస్సింగ్ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న నాంపల్లి పోలీసులు ఆరు గంటల్లో కిడ్నపర్లను పట్టుకొని పసికందును తల్లిదండ్రికు అప్పగించారు. వివరాల్లోకి వెళ్ళితే....  జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం గఫార్ల దంపతులకు చెందిన నెల రోజుల పసికందుకు పసిరికలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకోచ్చారు.

శనివారం రాత్రి హసీనా బేగం పసికందును ఎత్తుకుని ఉండగా తాను ఆసుపత్రి సిబ్బంది అని మాయమాటలు చెప్పి నమ్మించి ఓ మహిళా పసికందును ఎత్తుకొని అక్కడి నుండి మెల్లగా జారుకుంది. పసికందు, మహిళా ఇద్దరు కనిపించకుండా పోవడంతో ఆసుపత్రి మొత్తం వెతికిన ఫలితం లేకపోవడంతో తన భర్తతో కలిసి నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని సాంకేతిక ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పసికందును తీసుకుని మహిళా హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు వెళుతున్నట్లు గుర్తించారు. దీంతో గద్వాల జిల్లా పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.

అప్రమతమైన ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు చెందిన ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్గేట్ సమీపంలో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఓమ్ని వ్యాన్‌లో ముగ్గురు చిన్నారులతో ఆరుగురు కలిసి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.  అందులో ఓ మగ పిల్లవాడు, ఇద్దరు ఆడబిడ్డలు సురక్షితంగా ఉన్నారని పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందించి, ఆరుగురు కిడ్నాపర్లను అదుపులకు తీసుకొని నాంపల్లి స్టేషన్ కు అప్పగించారు. అనంతరం నాంపల్లి పోలీసులు పసికందును సురక్షతంగా తల్లి హసీనా బేగం వద్దకు చేర్చారు. జోగులాంబ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని 6 గంటల వ్యవధిలోనే ముఠాను పట్టుకోవడంతో కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.