calender_icon.png 13 December, 2024 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్

13-12-2024 05:14:51 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లిలోని స్థానిక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అల్లు అర్జున్ ను పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం నాంపల్లి క్రిమినల్‌ కాంప్లెక్స్‌లోని కోర్టులో హాజరుపరిచారు. పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే పోలీసులు అతడిని మెడికల్ చెకప్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఎస్కార్ట్ బృందంతో కలిసి చిక్కడపల్లి పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. అల్లు అర్జున్ అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలివస్తారని భావించిన హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చంచల్ గూడ జైలు వద్ద సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.