calender_icon.png 23 October, 2024 | 8:52 PM

కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన కేటీఆర్

23-10-2024 06:25:04 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కొండా సురేఖపై వేసిన పరువునష్టం దావాపై మాజీ మంత్రి కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు.  తను ఫోన్ ట్యాపింగ్ చేశానని, డ్రగ్ అడిక్ట్ అయానని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని, తన వల్లే కొన్ని పెళ్లిళ్లు బ్రేక్ అయినట్లుగా సురేఖ ఆరోపణలు చేసినట్లు చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, తనతోపాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించిందన్నారు.

మంత్రి తన పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యాలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను టీవీల్లో చూసిన సాక్షులు ఫోన్ చేశారని, సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసాని కేటీఆర్ వాంగ్మూలంలో తెలిపారు. ఆయనతో పాటు సాక్షులు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్కసుమన్ వాంగ్మూలాన్ని కూడా కోర్టు రికార్డు చేసుకుంది. మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈనెల 30న నమోదు చేస్తామని, నాంపల్లి కోర్టు తీర్పును వాయిదా వేసింది.