calender_icon.png 30 October, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా సురేఖపై పరువునష్టం దావా.. విచారణ వాయిదా

30-10-2024 01:30:05 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు నాంపల్లి కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జడ్జి సెలవులో ఉండటంతో నవంబర్ 13కి వాయిదా పడింది. ఈ కేసులో మంత్రి కొండా సురేఖ తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంత్రి కొండా సురేఖ  కోర్టుకు హాజరుకావాల్సి ఉండే కానీ, మంత్రి తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖాలు చేసిన పరువు నష్టం పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఈ కేసు విచారణ కూడా నవంబర్ 13వ తేదీకి వాయిదా వేస్తూ ఇంన్ చార్జీ జడ్జి తీర్పును వెలువరించారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ వాంగ్మూలాలను రికార్డు చేసిన కోర్టు ఇవాళ తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉంది. తనపై మంత్రి కొండ సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు.