calender_icon.png 5 January, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ

03-01-2025 12:01:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్(Allu Arjun Regular Bail Petition)పై నాంపల్లి కోర్టు(Nampally Court) తీర్పు వెలువరించునుంది. ఇప్పటికే ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షో(Pushpa-2 Benefit Show) సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్(Allu Arjun)పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బన్నికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆ రోజే చంచల్ గూడ జైల్ పంపించారు. ఆయన తరుపు న్యాయవాది హైకోర్టును ఆశ్రహించిన మధ్యంతర బెయిల్ పై బయటకు తీసుకువచ్చారు. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఇవాళ మధ్యాహ్నం అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ప్రస్తతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.