హైదరాబాద్: నాంపల్లి కోర్టులో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీ-ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ రిమాండ్ పై గురువారం సాయంత్రం వాదనలు కొనసాగాయి. ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 వేల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. విచారణకు సహకరించాలని శ్రీనివాస్ కు కోర్టు ఆదేశించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేయడాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సీనియర్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు సహా బీఆర్‌ఎస్ నేతలు ఖండించారు. ఇది విపక్ష నేతలపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడే చర్యగా అభివర్ణించారు. దళిత, బహుజన వర్గాలకు అమలు చేయని ఎన్నికల వాగ్దానాలను ప్రశ్నించినందుకు బీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని కేటీ రామారావు ఒక ప్రకటనలో ఆరోపించారు.