calender_icon.png 16 January, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమోభారత్ ర్యాపిడ్ రైల్

17-09-2024 04:23:12 AM

  1. వందే మెట్రో రైళ్లకు అధికారిక పేరు 
  2. విమానాలను తలపించే వసతులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: భారతీయ రైల్వేలను ఆధునీకరించటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మరో ప్రత్యేక రైలు వందే మెట్రో. ఈ రైళ్లకు ‘నమోభారత్ రాపిడ్ రైల్’ అని రైల్వేశాఖ పేరు పెట్టింది. ఈ రకానికి చెందిన మొదటి రైలు ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. గుజరాత్‌లోని భుజ్ అహ్మదాబాద్ నగరాల మధ్య ఇది ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. నమో రైళ్లోని విశేషాలేంటో చూద్దాం..

  1. రైలుకు 12 బోగీలు ఉంటాయి. 1150 మంది ప్రయాణం చేయవచ్చు.
  2. భుజ్  అహ్మదాబాద్ మధ్య 359 కి.మీ దూరాన్ని 5.45 గంటల్లోనే చేరుకొంటుంది. టికెట్ ధర రూ.౪౫౫.  
  3. మంగళవారం నుంచి ప్రయాణికులకు ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. 
  4. ఈ రైళ్లోని ప్రతి బోగీ పూర్తిగా ఎయిర్ కండిషనర్. విమానంలో ఉండేలాంటి సీట్లు ఇందులో ఉంటాయి. బోగీ లోపలి భాగం ఎంతో అందంగా, గ్రాండ్ లుక్‌తో ఉంటుంది. 
  5. ఎన్సీఆర్టీసీ, రాష్ట్రాల భాగస్వామ్యంలో వీటిని తీసుకొస్తున్నారు.