calender_icon.png 7 March, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమో.. నారసింహ!

07-03-2025 12:57:28 AM

  • 6 వ రోజు గోవర్ధనగిరి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు 
  • యాదగిరిగుట్టలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

యాదాద్రి భువనగిరి, మార్చి 6 (విజయ క్రాంతి): స్తంభొద్భవుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తజన కోటి జయ జయ ధ్వనాల మధ్య దేదిప్యమానంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు అయిన గురువారం నాడు ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనలు, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని గోవర్ధన గిరిదారి అలంకార శేవలో అలంకరించి.

ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు వేద పండితులు, అర్చక బృందం, పారాయణికులు, అత్యంత వైభవంగా ఆలయ తిరువీధులలో భక్తుల దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు. గోవర్ధనగిరి దారి అలంకార సేవలో యాదగిరి లక్ష్మీ నారసింహున్ని చూసిన భక్తులు భక్తి పరవశంతో ఊగిపోయారు. నారాయణ నరసింహ, మము బ్రోవ రావా ! యాదాద్రి నమో నరసింహ, అంటూ స్వామివారిని స్తుతించారు.

శ్రీ గోవర్ధనగిరి దారి అలంకార సేవ ప్రత్యేకత

పరమాత్మ శ్రీకృష్ణ అవతారంలో బృందావనములు ఎన్నో లీలలను దర్శింప చేసినాడు. ఒకనాడు బృందావనంలోని గోపకులందురు మేఘాధిపతి అయిన ఇంద్రుడిని పూజిస్తే వర్షాలు పడునని, తద్వారా గోవులకు గ్రాసము లభించునని ఇంద్ర పూజ చేయడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు ఇంద్ర పూజను నిరాకరించి గోవర్ధన పర్వతమును పూజించమని చెప్పాను. దానికి కోపగించిన ఇంద్రుడు కుంభద్రోణ వర్షమును కురిపించ సాగేను.

ఇంద్రుడి గర్వాన్ని అనుచుటకై శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించెను. శ్రీకృష్ణ పరమాత్మ  లీలా... విశేషాన్ని గ్రహించిన ఇంద్రుడు గర్వాన్ని వదిలి గోవిందా: ఇతి లోకేత్వం గోశ్యం. భువి మానవ: అని గోవింద అను నామమును శ్రీకృష్ణునికి బిరుదుగా ఇచ్చి ఉపక్రమించెను.

శ్రీ స్వామి వారు గోవర్ధనగిరి దారిగా భక్తులకు దర్శన భాగ్యము కలిగించుచు సర్వ జగద్రక్షకుడును తానేనని తన లీలా వైభవాన్ని దర్శింపజేయుట ఎంతో ప్రత్యేకమైనదని పండితులు,ప్రధాన అర్చకులు వివరించారు.శ్రీ స్వామివారిని సాయంకాలం నిత్యారాధనలు అనంతరం రాత్రి 7 గంటలకు సింహ వాహన సేవలో అలంకరించి మాడవీధులలో ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, ఊరేగింపు వేడుక నిర్వహించారు.

సింహ వాహన సేవ ప్రత్యేకత 

శ్రీ స్వామి వారు సింహ వాహనదారుడై భక్తులకు దర్శన భాగ్యము కలిగించారు. నరసింహ కృతి కలిగిన స్వామి మృగరాజు అయిన సింహంపై ఊరేగుట ఎంతో ప్రత్యేకమైనది. మృగానాం చ మృగేంద్రోహం అని  భగవత్ వచనం. కార్య దీక్షకు బుద్ధి  కుశలతకు, పరాక్రమానికి, ధైర్యానికి గాంబిర్యానికి శత్రుసంహారానికి ప్రతీక సింహం భక్తుడు సింహం వంటి బలపరాక్రమాలు కలిగి పరాక్రమాలు కలిగి ఉంటే భగవంతుడు వారిపై రక్షకుడిగా ఉండి అనుగ్రహిస్తాడని ఆర్యుక్తి.

ఎన్నో విశిష్ట గుణాలు కలిగిన సింహ వాహనదారుడైన శ్రీ స్వామివారిని దర్శించిన దుష్టశక్తులు భయము తొలగి స్వామి అనుగ్రహము కలుగునని శాస్త్రోక్తం తెలియజేస్తుందని ప్రధానార్చకులు వివరించారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకుల తోపాటు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈవో భాస్కరరావు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

ధార్మిక, సాహిత్య, సంగీత మహా సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు

వార్షిక బ్రహ్మోత్సవాల 6 వ రోజు యాదాద్రి కొండ. ధార్మిక, సాహిత్య, సంగీత, మహాసభలు సాంస్కృతి కార్యక్రమాలతో కళకళలాడాయి. కే శ్రీనివాసాచార్యుల వారిచే భగవానుడు రక్షించిన విధానంపై ఉపన్యసించారు. శ్రీ ముదపాక బాల సుందరం భగవాధార్ అర్కత కాలక్షేపాన్ని నిర్వహించారు. స్మరణ డాన్స్ అకాడమీ బృందం హైదరాబాద్ వారు భరతనాట్యం నిర్వహించారు.

మహతి ఆర్ట్స్ వింజమూరు లక్ష్మీ బృందం భక్తి సంగీతాన్ని నిర్వహించారు. దుర్గాబాయి దేశ్ముఖ్ ఫైన్ షాట్స్ బృందం హైదరాబాద్ వారు భక్తి సంగీత కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య సంకీర్తన విభ వారి నిర్వహించారు. వివిధ అకాడమీల బృందం కూచిపూడి, భరతనాట్యాలను నిర్వహించారు.