నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’కి మంచి స్పందన లభించింది. శనివారం సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘నమో నమః శివాయ’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటలో నాగ చైతన్య, సాయిపల్లవి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ పాటను ఓ మెట్టు ఎక్కించింది. అనురాగ్ కులకర్ణి, హరిప్రియ వోకల్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించారు. సెట్ డిజైన్, మ్యాజెస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లు కనువిందు చేస్తున్నాయి. ఫిబ్రవరి 7న ‘తండేల్’ విడుదల కానుంది.