calender_icon.png 30 October, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమో ఈశ్వర..

30-10-2024 12:00:00 AM

హీరో మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అశోక్ ఇందులో మాస్, యాక్షన్- ప్యాక్డ్ పాత్రలో కనిపించనుండగా వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి.

తాజాగా మేకర్స్ ‘నమో ఈశ్వర’ అనే గీతాన్ని రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్‌ను ఆధ్యాత్మికమైన బాణీలో కంపోజ్ చేశారు. శ్రీనివాస మౌళి పత్రి సాహిత్యం, స్వరాగ్ కీర్తన్ గాత్రంలో ఈ పాట వినసొంపుగా సాగుతోంది. ఈ పాటలో హీరో అశోక్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా; సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్.