న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ఢిల్లీ-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లోని 13 కి.మీ విభాగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆదివారం ప్రారంభించారు. సాహిబాబాద్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో కూడా మోదీ ప్రయాణించారు. తన ప్రయాణంలో, ప్రధాన మంత్రి పిల్లలు, ప్రజలతో ముచ్చటించారు. ఆర్‌ఆర్‌టీఎస్‌లోని ఢిల్లీ విభాగం ప్రారంభంతో దేశ రాజధానికి నమో భారత్ రైళ్లు(Namo Bharat Corridor) వచ్చాయి.
న్యూ అశోక్ నగర్, మీరట్ సౌత్ మధ్య 55 కిలోమీటర్ల RRTS కారిడార్, 11 స్టేషన్లతో పనిచేయడం ప్రారంభించింది. ప్యాసింజర్ కార్యకలాపాలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయి. రైళ్లు ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. న్యూ అశోక్ నగర్ స్టేషన్(New Ashok Nagar Station) నుండి మీరట్ సౌత్ స్టేషన్‌కు స్టాండర్డ్ కోచ్‌కు రూ. 150 ప్రీమియం కోచ్‌కు రూ. 225. గత ఏడాది అక్టోబర్ 20న సాహిబాబాద్, దుహై డిపో మధ్య 17 కి.మీ ప్రాధాన్యతా విభాగాన్ని ప్రధాని ప్రారంభించారు.