రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. గోల్కొండ పత్రిక ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగలించిన గొప్ప వ్యక్తి సురవరం అని కొనియాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆయన తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం వనపర్తి నుంచి తొలి ఎమ్మెల్యేగా 1952లో ఎన్నికయ్యారని గుర్తు చేశారు. వర్సిటీకి సురవరం పేరు పెట్టినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.