calender_icon.png 30 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేర్లు రాని అర్హులను జాబితాలో చేర్చాలి

25-01-2025 01:22:10 PM

వెన్నెల నగర్ లబ్ధిదారులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి

అర్హులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున పోరాడుతాం

సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డుల్లో అర్హుల పేర్లు జాబితాలో రాలేదు వారిని తక్షణం జాబితాలో చేర్చాలని సేవ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ డిమాండ్ చేశారు. ప్రజాపాలన లో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పెద్ద ఎత్తున పేర్లు రాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. మరల దరఖాస్తులు పెట్టుకోడంటూ ఎలాంటి ఆధార రిసిప్ట్ ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అర్హుల జాబితాలో పేర్లు రాని వారిని మళ్లీ యాడ్ చేయాలని ఆయన కోరారు. మున్సిపాలిటీ పరిధిలో 75 గజాల ప్రభుత్వ స్థల లబ్ధిదారులు వెన్నెల నగర్ వారికి మొదటి విడతలో ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. పేదలను డ్రా రూపంలో డ్రా వేసి అపహస్యం చేయరాదని దశలవారీగా లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వార్డు సభలలో జరిగిన తప్పు ఒప్పులను ఆయన దృష్టికి తీసుకెళ్లి తక్షణమే సమస్యలు పరిష్కరించమని విజ్ఞప్తి చేశారు