మందమర్రి,(విజయక్రాంతి): ప్రజాపాలన దరఖాస్తుల భాగంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారు జాబితాలో పేరు లేకుంటే తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మండల తహశీల్దార్ సతీష్ కుమార్ కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన సర్వే జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందవద్దని కోరారు. పేర్లు రానీ వారు తహశీల్దార్ కార్యాలయంలో వారి యొక్క ఆధార్, ప్రజాపాలన రిసీప్ట్, మీ సేవ అప్లికేషన్, మొబైల్ నంబర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.