calender_icon.png 7 January, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరు లేని రెలు!

05-01-2025 01:28:04 AM

  1. నేటికీ నంబర్లతోనే నడుస్తున్న కొన్ని రైళ్లు 
  2. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
  3. పేర్లు పెట్టాలని పెరుగుతున్న డిమాండ్

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): చార్మినార్ ఎక్స్‌ప్రెస్, హుసేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్.. ఇవన్నీ రాష్ట్ర రాజధాని నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల పేర్లు. అవి నడిచే నగరాలను బట్టి రైలుకు పేరు పెడుతుంటారు. కానీ, నేటికీ కొన్ని రైళ్లకు పేర్లు లేక పోవడం గమనార్హం. సాధారణంగా రైలు పేరుతోనే ప్రయాణికులు వాటిని సులువుగా గుర్తుపడుతుంటారు.

పేరు లేని రైళ్లను గుర్తుపట్టడం చాలా కష్టం. అలాంటి రైళ్లను ఆ యా నగరాల మధ్య నడిచే రైళ్లని పేర్కొం టూ వాటి నంబర్ల మీదే గుర్తుంచుకోవాలి. కానీ, రైళ్లు నెంబర్లు గుర్తుంచుకునే అవకాశం తక్కువ. అందుకే ప్రతి రైలుకూ ఓ పేరుంటే రైల్వేప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉం టుందని ద.మ. రైల్వే వినియోగదారుల సంఘం సభ్యుడు నూర్ అహ్మద్ పేర్కొంటున్నారు.

ఒక్కో రైలుకు ఒక్కో పేరు 

సాధారణంగా రైళ్లకు వాటి గమ్యస్థానా లు, అక్కడి ప్రఖ్యాతి గాంచిన కట్టడాలు, ప్రాసస్త్యం ఉన్న పేర్లనే పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతర పేర్లను కూడా ఖరా రు చేస్తారు. రైలు ప్రయాణించే ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లను కూడా పెడుతుంటా రు. ఉదాహరణకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ అన్నది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా 1989లో మొదలైం ది. అందుకే దానికి శతాబ్ది అని పేరు పెటా ్ట రు.

ఇక రాజధాని ఎక్స్‌ప్రెస్ అంటూ దేశ రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు నడిచే రైళ్లకు పెట్టారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి రాష్ట్రాల రాజధానుల మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. హైదరాబాద్ నుంచి త్రివేం డ్రం మధ్య రైలుకు శబరి ఎక్స్‌ప్రెస్ పేరు వినగానే శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడుతుందని అర్థమయిపోతుంది.

తిరుపతికి నడిచే రైళ్లకు తిరుమల, వెంకటాద్రి, కృష్ణా, పద్మావతి, సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ అనే పేర్లు కనిపిస్తాయి. పేదలకు చౌకైన ఏసీ రైలు సదుపాయం కోసం తీసుకువచ్చిన రైళ్లకు గరీబ్థ్ అని పేరు పెట్టా రు. తుంగభద్ర, హంద్రీ, వంశధార, నాగావళి ఇలా అనేక నదుల పేర్లనూ రైళ్లకు పెట్టా రు. చాలా రైళ్లకు ఊర్ల పేర్లనూ పెట్టారు.

బెం గళూరు మెయిల్, చెన్నై మెయిల్, మైసూరు ఎక్స్‌ప్రెస్ అని. కానీ, అవే రైళ్లు తిరుగు ప్రయాణంలోనూ అదే పేరుతో వచ్చినప్పు డు ప్రయాణికులు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే రైలుకు నగరాల పేర్లు కాకుండా ఏదైనా ఇతర పేరుతో పిలిస్తే కాస్త సౌలభ్యం గా ఉంటుందని ప్రయాణికులు చెప్తున్నారు. 

పేరుంటేనే ప్రయాణికుడికి సౌలభ్యం

మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలుకు పేరు లేదు. దీనికి పాలమూరు ఎక్స్‌ప్రెస్ అనో లేదా ప్రఖ్యాతి పిల్లలమర్రి ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టినా బాగుంటుందని మహబూబ్‌నగర్‌కు చెందిన కృష్ణవర్ధన్‌రెడ్డి తెలిపారు. కాచిగూడ నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలుకు సైతం పేరు లేదు.

ఈ రైలుకు కూడా తెలంగాణలో లేదా తమిళనాడులో ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్ దానాపూర్, లింగంపల్లి సికింద్రాబాద్ దర్బంగా, సికింద్రాబాద్ గుంటూరు సూపర్ ఫాస్ట్, సికింద్రాబాద్ మణుగూరు, హైదరాబాద్ జైపూర్, హైదరాబాద్ రాక్సల్, హైదరాబాద్ ముంబయి, కాచిగూడ నార్కెర్, కాచిగూడ హుబ్లీ, కాచిగూడ వాస్కోడిగామ, కాచిగూడ రాయిచూరు ఇలా అనేక రైళ్లకు పేర్లు లేవు.

ఈ రైళ్లను ఆయా ఊరి పేర్లతో వాటి నంబర్ల ఆధారంగానే పిలుస్తారు. ఫలితంగా రైలు రిజర్వేషన్ సమయంలో, ఇతరులకు సమాచారం ఇచ్చే సమయంలో ఇబ్బంది అవుతుంది. అందుకే ప్రతి ఎక్స్‌ప్రెస్, దూర ప్రాంత రైళ్లకు పేరు పెడితే ఎంతో సౌలభ్యంగా మారనుంది. 

పేరుతోనే గుర్తించడం సులభం

రైళ్లలో లోకల్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, రాజధాని, శతాబ్ది, వందేభారత్ ఇలా అనేక రకాలుంటాయి. రైలుకు పేరుంటేనే ప్రత్యేకంగా ఆ పేరుతో టికెట్ తీసుకోవచ్చు. మొదట రైలు నంబర్ల ఆధారంగానే పలు రైళ్లు నడిచాయి. వినియోగదారుల విజ్ఞప్తిమేరకు అనేక రైళ్లకు పేర్లు పెట్టారు.

సికింద్రాబాద్ కర్నూలు మధ్య నడిచే రైళ్లకు గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు హంద్రీ, తుంగభద్ర అనే పేర్లు పెట్టారు. పలుమార్లు రైళ్లకు మేం పేర్లను సూచిస్తాం. విజ్ఞప్తిని రైల్వే బోర్డుకు పంపించి మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తారు.  రైళ్లకు పేర్ల విషయంలో అధికారులు సైతం ఒకసారి సమీక్షిస్తే చాలా బాగుంటుంది.

 నూర్ అహ్మద్, ద.మ.రైల్వే వినియోగదారుల సంఘం సభ్యుడు