27-03-2025 12:00:00 AM
‘సంక్రాంతికి వస్తున్నాం’తో మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఆయన మెగాస్టార్ చిరంజీవితో కొలాబరేట్ అవుతున్నారు. కామిక్ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరుపొందిన అనిల్ రావిపూడి కామెడీ, ఎమోషన్, యాక్షన్‌ను బ్లెండ్ చేసే స్క్రిప్ట్‌తో చిరంజీవిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రలో చూపించనున్నారు.
ప్రతిష్టాత్మక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సాహు గారపాటి నిర్మించే ఈ చిత్రం పండగ వైబ్స్, ఎమోషన్స్, అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ వినోదంతో ఈ చిత్రం ఉండనుందని చిత్రబృందం చెబుతోంది. అనిల్ రావిపూడి ఫైనల్ నరేషన్ వినిపించగా, చిరంజీవి స్క్రిప్ట్‌ను మెచ్చి థ్రిల్ అవ్వడమే కాకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మెగాస్టార్ ఓకే చెప్పడమే ఆలస్యం.. చిత్రబృందం ఫుల్ స్వింగ్‌లో పనిలోకి దిగిపోయింది.
ఈ ప్రాజెక్టుకు త్వరలోనే ముహూర్తం పెట్టనున్నారు. మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయనున్నారు. ఈ విషయా లన్నింటినీ తెలియజేస్తూ డైరెక్టర్ అనిల్ సామాజిక మాద్యమాల వేదికగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన పెట్టిన పోస్ట్ ప్రకారం.. చిరంజీవి శంకర్ వరప్రసాద్ పాత్రను పోషించనున్నారు. మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.
అంటే చిరంజీవి అసలు పేరుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారానే డైరెక్టర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రకటనతోనే సినిమాకు మరోస్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చిరంజీవి.. పూర్తిస్థాయి కామెడీ అవతార్‌లో కనిపిస్తారట. వచ్చే సంక్రాంతి సినిమాల బరిలో ఉండనున్నట్టు ముందస్తుగానే ప్రకటించిన ఈ మెగా ఎంటర్‌టైనర్‌కు సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.