calender_icon.png 8 January, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంబి నారాయణన్‌ని తప్పుడు కేసులో ఇరికించారు

12-07-2024 02:17:49 AM

సీబీఐ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు

న్యూఢిల్లీ, జూలై 11 : ఇస్రో రహస్యాలను శత్రుదేశాలకు అమ్మారనే అభియోగంపై 1994లో అరెస్టున శాస్త్రవేత్త నంబి నారాయణన్ కేసులో సీబీఐ చివరి ఛార్జి షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు బయటపెట్టింది. నారాయణన్‌ను కేరళ పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని, ఎలాంటి ఆధారాలు లేకుం డానే కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ మేరకు కేరళ మాజీ డీజీపీ సీబీ మాథ్యూవ్‌తో పాటు మరికొందరి పేర్లను ఛార్జిషీట్‌లో చేర్చింది. “రిటైర్డ్ సీఐఎస్ విజయన్ ఎలాంటి ఆధారాలు లేకుండానే మాల్దీవులకు చెందిన మహిళ మరి యా రషీదాపై కేసు నమోదు చేశా డు.

అనంతరం ఆనాటి ఇస్రో శాస్త్రవేత్త నారాయణన్‌ను కూడా దోషిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. మా విచారణలో ఈ కేసు చట్ట విరుద్ధ్దమని తేలింది. తప్పుడు విచారణ రిపోర్టును పోలీసులు సృష్టించారు. ఈ వ్యవహారంలో రిటైర్డ్ పోలీసులు విజయన్, మాథ్యూవ్, జోషువా, శ్రీకుమార్, జయప్రకాశ్‌ల ప్రమే యం ఉంది” అని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కాగా, సీఐ విజయన్ మాల్దీవులకు చెందిన మరియా రషీదాపై హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకుని తప్పుడు కేసులో ఇరికించాడని తెలిపింది. రషీదాకు ఓ ఇస్రో శాస్త్రవేత్తతో సంబంధం ఉండటంతో నారాయణన్ సహా కొంతమందిని ఈ కేసులో  ఇరికించారని సీబీఐ తెలిపింది.