calender_icon.png 5 November, 2024 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమస్తే తెలంగాణపై కేసు

03-11-2024 01:25:33 AM

తప్పుడు కథనం ప్రచురించారని రైతుల ఫిర్యాదు

మహేశ్వరం, నవంబర్ 2:  తప్పుడు కథనంతో తమకు నష్టం కలిగేలా చేశారని గుర్రంగూడకు చెందిన రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో నమస్తే తెలంగాణ దినపత్రికపై రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 92లో ఉన్న 290 ఎకరాల భూమికి సంబంధించి నమస్తే తెలంగాణలో అక్టోబర్ 31న ‘బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. తమ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చామని తప్పుడు కథనం ప్రచురిం చారని రైతులు పేర్కొన్నారు.

తమ భూమిని డెవలపర్స్‌కు ఇవ్వడానికి అంగీకరించామని, ఇందుకుగాను ఎకరాకు రూ.10 లక్షలతో పాటు అభి వృద్ధి చేసిన 1000 గజాల చొప్పున ప్లాటు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందుకు సంబంధించిన ఫేక్ ఫోర్జరీ అగ్రిమెంట్లను సృష్టించి తప్పుడు కథనం ప్రచురించారని ఆరోపించారు.

ప్రభుత్వ పెద్ద బంధువులే డైరెక్టర్లు, ప్రాజెక్ట్ విలువ రూ.2,600 కోట్లపైనే అనే తప్పుడు రాతలతో తమకు నష్టం చేకూర్చారని రైతులు ఫిర్యాదు చేశారు. రైతులతో పాటు బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి కూడా నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసినట్లు మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. దీంతో పోలీసులు నమస్తే తెలంగాణ ఎండీ, మేనేజ్‌మెంట్, ఎడిటర్‌తో పాటు దీనికి బాధ్యులైన వారిపై  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.