15-03-2025 10:42:05 PM
కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధి కృష్ణ బంజరు గ్రామ పంచాయతీ పరిధిలో గల విశ్వబ్రాహ్మణ కాలనీలో నామా ప్రధాన అనుచరులు పోలోజు సుధాకరాచారి ఆధ్వర్యంలో శనివారం శ్రీ దుర్గ గణేష్ వీర బ్రహ్మేంద్రస్వామి దేవస్థానం(Sri Durga Ganesh Veerabrahmendra Swamy Temple)లో ముందుగా పూజలు నిర్వహించి అటు పిమ్మట నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్(Nama Muttiah Memorial Trust) నుండి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను వారు నామా అనుచరులు నడుమ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అందులో భాగంగా బారీ కేక్ ను కట్ చేసి అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నామా ప్రధాన అనుచరులు పోలోజు సుధాకరా చారి,తూముల శ్రీనివాసాచారి,రామడుగు కృష్ణమాచారి, సంగోజు రవి,పోలజు సత్యన్నారాయణ, ఖంబంపాటి నరసింహాచారి,పతకముడి శ్రీకాంత్ నామా అబిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.