పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిగా నలుమాచు ప్రభాకర్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ఆర్య వైశ్య సంఘం ఎన్నికల్లో మంథని పట్టణానికి చెందిన నలుమాచు ప్రభాకర్ ను ఆర్యవైశ్య సభ్యులు జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్యవైశ్య కుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు తన నియమానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు కు జిల్లా ఆర్యవైశ్య సంఘం సోదరులకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.