calender_icon.png 1 April, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థి మృతి చెందడం బాధాకరం..

29-03-2025 08:06:55 PM

గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి పై సమాచారం తెలుసుకున్న నారాయణఖేడ్ సంజీవరెడ్డి

సిర్గాపూర్: సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మృతి చెందడం పై ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు గురుకుల పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులతో కలిసి మృతి పై సమాచారం తెలుసుకున్నారు. శంకరంపేట్ మండలం చీలపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ అనే విద్యార్థి ఆకస్మిక మరణ వార్త విన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హుటాహుటిన పాఠశాలకు వెళ్లి మృతికి గల కారణాలను పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్  చెప్పింది వాస్తవమో కాదు అని నిఖిల్ యొక్క తరగతి మిత్రులను కూడా ఎమ్మెల్యే పిలిచి నిఖిల్ తరగతి క్లాస్ రూమ్ లో ఆటలు ఆడే సమయంలో తన యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందని నిఖిల్ యొక్క మిత్రులకు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

దానికి వారి మిత్రులు క్లాస్ రూమ్ లో మాత్రం నిఖిల్ యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉండేవారని వారి మిత్రులు ఎమ్మెల్యేకు చెప్పడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే  సిర్గాపూర్ మండల వైద్యాధికారి నిర్లక్ష్యం ఉందని ఎమ్మెల్యే  దృష్టికి రావడంతో ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో గాయత్రి దేవికి ఫోన్ చేసి గురుకులలో  ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, స్థానిక వైద్యాధికారులు ప్రతి నెల పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయాలను తెలుసుకోవాలని, ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు పునరావృతం కవద్దని డి.ఎం.హెచ్.వో కు, పాఠశాల ప్రిన్సిపాల్  కు ఎమ్మెల్యే సూచించారు.  నిఖిల్ కుటుంబానికి మా ప్రభుత్వ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు  బోజీరెడ్డి , నాయకులు యాదవ్ రెడ్డి , రమేష్ చౌహాన్,  దేవదాస్, జైరాజ్, శ్యామ్ ప్రసాద్ ముదిరాజ్,  పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.