calender_icon.png 27 December, 2024 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల పోచమ్మ గుడి 30 గుంటల భూమిక

26-12-2024 11:20:32 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజాంబాద్ రూరల్ పరిధిలోని కాలూరు కొండూరు శివారులో నల్ల పోచమ్మ ఆలయానికి సంబంధించి న భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఈ భూమి కురుమ శంకర్ ఆలయం చెందినదిగా అనాదిగా రికార్డుల్లో వస్తోంది గ్రామస్తులకు కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్ పార్టీకి నాయకులైన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత భర్త ఆకుల రాఘవేందర్ మాజీ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు గడిల రాములు కబ్జా చేశారని కబ్జాల వీధి ప్రధాన పాత్ర అని గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు 

అనంతరం ఆలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు భోజన విలేకరులతో మాట్లాడుతూ సర్వేనెంబర్ 109 లో 12 ఎకరాల 13 గుంటల వ్యవసాయ భూమి ఉందనీ ఆయన తెలిపారు. ఈ భూమిలో 33 గుంటలు అనాదిగా  నల్ల పోచమ్మ ఆలయాని కేటాయించడం జరిగిందనీ తెలిపారు. ఈ 33 గుంటల భూమిపై కన్నేసిన ఆకుల రాఘవేందర్ గడీల రాములు ఇద్దరు చెరి 15 గుంటల చొప్పు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా ధరణి ఖాతాలో సంబంధిత భూమిపై ఎవరికి హక్కులు లేవని ఇద్దరు నాయకులు వాటినీ తమ పేర్లపై మార్పించుకుని భూమిని కబ్జా చేస్తారని ఆయన తెలిపారు. వారి కబ్జా లో నుండి భూమిని విడిపించలని అధికారులను కోరామని ఈ విషయమై ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. దేవాలయానికి చెందిన భూమిగా ఉన్న ఈ భూమి కై రెండు గ్రామాల ప్రజలను పోరాటానికి సిద్ధ మవుతున్నామని వారు ప్రకటించారు.