calender_icon.png 25 February, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 5న నల్లగొండ యువ ఉత్సవ్

25-02-2025 01:10:08 AM

నల్లగొండ, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో  మార్చి 5న జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్రాజు తెలిపారు. సోమవారం కళాశాల ఆవరణలో అధ్యాపకులతో కలిసి ప్రచార వాల్పో స్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

యువ కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు, వక్త లు, సాంప్రదాయ కళాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెయింటింగ్, వ్యాస రచన, మొబైల్ ఫొటోగ్రఫీ, డిక్లమేషన్ (వక్తృత్వ), కల్చరల్ ఫెస్టివల్- గ్రూప్ ఈవెంట్స్, సైన్స్ మేళాపోటీలు ఉంటాయని పేర్కొన్నారు.

15 నుంచి 29 ఏండ్లున్న వారు కార్యక్ర మంలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్, ఎంకేనాయక్, డాక్టర్  అమరావతి, డాక్టర్  శ్రీనివాస్, డాక్టర్ అరవింద, డాక్టర్ సాలయ్య, డాక్టర్ మల్లీశ్వరి పాల్గొన్నారు.