calender_icon.png 28 October, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.41 కోట్ల విలువైన గంజాయిని కాల్చిన నల్గొండ పోలీసులు

13-08-2024 12:15:12 PM

నల్గొండ: రూ.1.41 కోట్ల విలువైన గంజాయిని నల్గొండ జిల్లా పోలీసులు మంగళవారం దగ్ధం చేశారు. మాదక ద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో 43 కేసులు ఉన్నాయని, అందులో 565 కేజీల గంజాయిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం నల్లగొండ పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు మంగళవారం జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ... నల్లగొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే తమ లక్ష్యంగా జిల్లా పోలీసులు గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘాపెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అత్యధికంగా నాగర్జునసాగర్, విజయపురి పోలీసు స్టేషన్ లో 2 కేసులలో 323 కేజీలు, కేతేపల్లి పోలీసుస్టేషన్ లో 98 కేజీలు సీజ్ చేయగా మొత్తం 43  కేసులలో 565 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, సమీప పోలీస్ స్టేషన్ లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 8712670266 కి సమాచారం ఇవ్వాలని కోరారు.