10-03-2025 12:31:15 PM
ప్రణయ్ హత్య కేసు : ఒకరికి ఉరిశిక్ష, మిగతావారికి జీవిత ఖైదు
హైదరాబాద్: ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Nalgonda SC and ST Court) సోమవారంనాడు సంచలన తీర్పు వెల్లడించింది. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ప్రణయ్ హత్య కేసు(Pranay Murder case)లో మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులు అనారోగ్య సమస్యలు ఉన్నందున శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. మాపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. ప్రణయ్ హత్యతో మాకెలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు. నాకు కేసుతో సంబంధం లేదని, అందరికీ తెలుసంటూ అమృత బాబాయి శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపాడు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయచూపాలని శ్రవణ్ కుమార్ వేడుకున్నాడు.
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య(Prannoy case) కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు ప్రకటించనుంది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. వ్యాపార వేత్త మారుతీరావు కుమార్తె అమృతను ప్రణయ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పదో తరగతి నుంచి ప్రణయ్, అమృత మంచి స్నేహితులుగా ఉన్నారు. 2020 జనవరిలో హైదరాబాద్(Hyderabad)లో ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్, అమృత పెళ్లితో రెండు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో ప్రణయ్, అమృత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
విచారణలో అమృత ప్రణయ్ తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో తేల్చిచెప్పింది. 2020 సెప్టెంబర్ 14న వైద్యపరీక్షల కోసం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి అమృత ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తుండగా దుండగులు ప్రణయ్ ను కత్తితో నరికి హత్య చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమృత భర్త ప్రణయ్ ఘటనాస్థలంలోనే ప్రాణలు వదిలాడు. కుమారైను పెళ్లి చేసుకున్నాడని మారుతీరావు ప్రణయ్ ను చంపించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడని ప్రణయ్ ని చంపించినట్లు విచారణలో తేలింది. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో మారుతీరావుతో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్(SP AV Ranganath) పర్యవేక్షణలో ప్రణయ్ హత్య కేసు విచారణ కొనసాగింది. ప్రణయ్ హత్య కేసుపై ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో 2019 జూన్ 12 1600 పేజీల ఛార్జిషీట్ ను పోలీసులు రూపొందించారు. ప్రణయ్ హత్య కేసు విచారణ కోర్టులో దాదాపు ఆరేళ్లు కొనసాగింది. 2020 మార్చిలో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ2 ప్రణయ్ ను హత్య చేసిన బిహార్ వాసి సుభాష్ శర్మ, ఏ3 అస్ఘర్ ఆలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ 5 అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు శ్రావణ్, ఏ 7 డ్రైవర్ శివ ఉన్నారు. కోర్టు తీర్పుతో ప్రజా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.