calender_icon.png 14 February, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదికి పది జీపీఏ సాధిస్తే విమానం ఎక్కిస్తా

14-02-2025 12:31:28 AM

విద్యార్థినులకు నల్లగొండ కలెక్టర్ లిఖితపూర్వ హామీ

నల్లగొండ, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థినుల్లో పోటీతత్వం పెంచి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహిం  నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక కానుక ప్రకటించారు. బుధవారం రాత్రి కనగల్‌లోని కేజీబీవీని తనిఖీ చేసిన ఆమె విద్యార్థినులతో కలసి భోజనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. పబ్లిక్ పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన వారిని విమానంలో చెన్నై, విజయవాడకు తీసుకెళ్తానని లిఖిత పూర్వక హామీ ఇచ్చారు.