calender_icon.png 18 March, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నాలా పూడిక తొలగింపు పనులు ప్రారంభం

18-03-2025 12:00:00 AM

పటాన్ చెరు, మార్చి 17 : రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ  రామాలయం రోడ్డులో  ఉన్న నాలా పూడిక తొలగింపు పనులను కార్పొరేటర్ పుష్పనగేశ్ యాదవ్ సోమవారం ప్రారంభించారు. నాలా పూడికను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ నుంచి రూ.40లక్షలు మంజూ రు అయ్యాయని చెప్పారు.

లింగంపల్లి కానుకుంటా నుంచి సాయిజ్యోతినగర్ కాలనీ ఉస్కేబావి వరకు పూడిక తొలగింపు పనులు జరుగుతాయన్నారు. పూడిక తొలగింపుతో దుర్వాసన, దోమల బెడద ఉండదన్నారు.  కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఏఈ దివ్యజ్యోతి, స్థానికులు ప్రభాకర్ రెడ్డి, నరేంద్ర బాబు, ప్రవీన్ కుమార్, ప్రతాప్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.