calender_icon.png 24 November, 2024 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్‌లో పర్యటించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ

21-11-2024 05:38:28 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు చేపట్టబోయే నాల విస్తరణ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ... ప్రతి వర్షా కాలం వరద నీరు చుట్టుపక్కల కాలనీలు ముంచెత్తడం వంటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని చెప్పారు. ఈ నాల విస్తరణ నిర్మాణ పనుల వలన చుట్టుపక్కల కాలనీల  ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుందని ప్రజలకు ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరుతాయని, రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ ఆనంద్, ఏఈ జగదీష్, కాంట్రాక్టర్ పీస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఆనంద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.