29-01-2025 12:45:14 AM
త్వరలోనే కొత్త సీఈవోను ప్రకటిస్తామన్న కంపెనీ..!
ముంబై: పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో నకుల్ రాజీనామా చేశారు. ఆయన సొం తంగా వ్యాపార ప్రయాణం మొదలపెట్టనున్నారు. ఈ క్రమంలో పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో పదవి నుంచి వైదొలిగా రు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో కంపెనీ వెల్లడించింది. ఆయన స్థానం లో సీఈవోను నియమించేందుకు సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నామని.. త్వరలోనే కొత్త పేరును ప్రకటిస్తామని పేర్కొంది.