నక్షత్ర నాల్గవ జన్మదిన వేడుకలు
యోగ ధ్యాన సెంటర్లో అన్నదాన వితరణ
పాల్వంచ,(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ఏ కాలనీలోని కామధేను స్తంభాల పిరమిడ్స్ యోగా, ధ్యాన మందిరంలో సందీప్ ఈశ్వరి దంపతుల మొదటి కూతురు మొలుగూరి నక్షత్ర నాల్గవ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ధ్యాన, యోగ సెంటర్ లోని సుమారు వందమందికి జన్మదినం సందర్భంగా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నక్షత్ర తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ... అన్నదానం కన్నా గొప్పది ఏది లేదని ఎవరికి తోచినంత వారు బీదలకు సాయం చేస్తే గొప్పవారు అవుతారని మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అన్నదానం రూపంలో ఏర్పాటు చేస్తే సంతోషంగా బీదలు సంతోషిస్తారని. మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు బీదలకు అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ముందుంటామని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన యోగ సెంటర్ నిర్వాహకులు, కే టి పి ఎస్ డి వై సి సి నాగరాజు ,సారయ్య, నాగేశ్వరరావు ,సుధారాణి, కుసుమకుమారి, అరుణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.