నడిగూడెం (విజయక్రాంతి): ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నడిగూడెంలోని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో బుధవారం గోదాదేవికి నక్షత్ర హారతులు ఇచ్చారు. ప్రత్యేక హారతులతో మహిళలు తిరుప్పావై విష్ణు సహస్రనామాలు ఆలపించారు. ఆలయ పూజారి శేష భట్టార్ వరదాచార్యులు, విజయ మహిళలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బౌరిశెట్టి వెంకటరత్నం, కెవిఎస్ఎన్ గుప్తా, వందనపు సూర్యప్రకాశరావు, వేల శ్రీనివాసరావు, దయాకర్ మోహన్ రావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.