- లక్ష్మీ కటాక్షం పేరుతో వ్యభిచారం?
- బాలికకు వంట మనిషి వల
- మంథని హాస్టల్లో కలకలం
- నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మంథని, నవంబర్ 26 (విజయక్రాంతి): కన్య పూజలు చేస్తే లక్ష్మి కటాక్షిస్తుందని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ హాస్టల్ విద్యార్థినికి వంట మనిషి వల వేయడం కలకలం రేపుతున్నది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపిన వంట మనిషి నగ్న పూజలకు సహకరించాలని కోరినట్లు సమాచారం. నగ్న పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షిస్తుందని నమ్మించి, వారం రోజుల క్రితం హాస్టల్ వర్కర్ కొందరు క్షుద్ర పూజలు చేసే వారిని సంప్రదించినట్లు తెలిసింది.
దీంతో ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లి వారంరోజులు అక్కడే ఉన్నది. సోమవారం తల్లిదండ్రులు రావడంతో వారికి విషయం తెలిపింది. దీంతో బాలిక బంధువులు, తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని వంట మనిషి ని నిలదీశారు. ఆమెతో వాగ్వాదానికి దిగడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెల కొంది. పోలీసులకు సమాచారం అందడంతో మంథని సీఐ రాజు, ఎస్సై రమేశ్ విచారణ చేపట్టారు.
కాగా గత కొంతకాలం గా మంథని నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్టల్లోని పేద ఆడపిల్లలకు లక్ష్మీ కటాక్షం పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారనే ప్రచా రం ఈ సంఘంటనతో వెలుగులోకి వచ్చిం ది. కలెక్టర్ ఆదేశాల మేరకు వంటమనిషిని విధుల్లో నుంచి తొలగించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. హాస్టల్లో డీఎస్ సీడీవో నాగశ్వర్ విచారణ చేపట్టారు. హాస్టల్కు ఎదురు గా ఉన్న ఇంటి వద్దకు బాలికను వంటమనిషి తీసుకెళ్లగా.. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తిని చూసి పారిపోయిందని అధికారి తెలిపారు.