calender_icon.png 25 October, 2024 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నజభజ జజర..

06-07-2024 03:00:41 AM

హర్షరోహన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘టుక్ టుక్’. చిత్రవాహిని, ఆర్‌వైజీ పతాకాలపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీవరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్, కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నజభజ జజర కథలెన్నో వినరా.. మన కథ విననిది రా’ అనే తొలి లిరికల్ సాంగ్ సంగీత ప్రియుల ముందుకు తెచ్చారు మేకర్స్.

సంతు ఓంకార్ సంగీత సహకారం అందిస్తూ ఆలపించిన ఈ గీత సాహిత్యాన్ని చిత్ర దర్శకుడు సుప్రీత్ అందించారు. ట్యూన్, లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇదొక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందించే చిత్రం. ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్తదనం ఆశించేవారికి సంతృప్తినిచ్చే సినిమా ఇది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయికుమార్; ఎడిటర్: అశ్వత్ శివకుమార్.