25-03-2025 05:08:15 PM
నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..
సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణ పరిధిలోని కింది బజార్ కు చెందిన మంగలి నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించాడని, నాగరాజు కుటుంబం దీనస్థితిలో ఉందని అండగా నిలిచేందుకు ముందుకు రావడం జరిగిందని సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నాగరాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ మాట్లాడుతూ... సంగారెడ్డి పట్టణంలో ఇటీవల మరణించిన మంగలి నాగరాజ్ కుటుంబానికి రూ .5వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సంఘం సభ్యుల చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించామన్నారు.
ఇటీవల సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ఏర్పడిందని, సంఘం యొక్క పేద కుటుంబంలో దురదృష్టవశాత్తు మరణించిన వారి అంత్యక్రియల ఖర్చులకు రూ. 5 వేలు సంఘం తరపున అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ముఖ్య సలహాదారులు పెంటయ్య, ఉపాధ్యక్షులు రంజోల్ ప్రభు, ఉప కోశాధికారి స్వాగత్ ప్రభు, యూత్ ప్రెసిడెంట్ చరణ్, యూత్ ప్రధాన కార్యదర్శి రాము, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.