calender_icon.png 1 October, 2024 | 7:06 PM

నాయి బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్ ప్రారంభం

01-10-2024 03:37:27 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో కమ్యూనిటీ హాల్లో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నగర మేయర్ సునీల్ రావుతో కలిసి నాయి బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్ ను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటగా హాల్ సమీపంలో ఉన్న కాళీమాత ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంగులకు  వేద పండితులు   తీర్థ ప్రసాదాలను అందించి  ఆశీర్వదించారు. నాయి బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్ ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల కొరకు బీసీ బందు దళితుల కొరకు దళిత బంధు  వంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.

ఈ కార్యక్రమాల ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎంతో అభివృద్ధి చెందారని, ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు ఎన్నో ఏళ్లుగా క్షవర వృత్తి మీదనే ఆధారపడి షాపులలో పనిచేసుకునే వారని...  అయితే బీసీ బందు పథకం ద్వారా  నాయి బ్రాహ్మణులు సొంతంగా క్షవర శాలలను ఏర్పాటు చేసుకునేందుకు లక్ష రూపాయలను కేసీఆర్  ఉచితంగా అందజేసినట్టు తెలిపారు. నా చేతులమీదుగా ఎంతో మందికి లక్షల రూపాయల చెక్కులను అందచేసినట్టు గుర్తు చేసారు. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ రద్దు చేసిందని, వెనకబడిన తరగతుల ప్రజలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ ఈ పథకాలను కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేశారు. బీసీల కు సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తేనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు యువగలం ఫౌండేషన్ పేరుతో నిర్వహించే కార్యక్రమాలు నాయి బ్రాహ్మణులకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నదని మానవ సంబంధాలు పెంపొందించుకునేందుకు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో కృషి చేస్తాయని తెలిపారు.