calender_icon.png 16 January, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నహీద్ భయం లేకుండా..

15-09-2024 12:00:00 AM

చెన్నై: భారత్ ఈ నెల 19వ తేదీన బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో తలపడనుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద టెస్టు సిరీస్ గెలిచి మాంచి ఊపు మీదుంది. పాక్‌పై బంగ్లా టెస్టు సిరీస్ గెలవడంలో యువ పేసర్, ఆరడుగుల ఆజానుబాహుడు నహీద్ రానా కీలకపాత్ర పోషించాడు. అతడి నుంచి ముప్పును తప్పించుకునేందుకు ఇండియా కూడా ఆరడుగుల పొడుగుండే పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్‌ను రంగంలోకి దించింది. గుర్నూర్ నెట్స్‌లో భారత బ్యాటర్లకు బంతులు విసురుతున్నాడు.