calender_icon.png 28 October, 2024 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 16న నాగ్‌పూర్ - సికింద్రాబాద్ వందేభారత్ షురూ

14-09-2024 12:30:27 AM

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

సికింద్రాబాద్‌లో స్వాగతం పలుకనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి):  వందేభారత్ రైళ్లు ఇప్పటికే తెలంగాణలో 3 మార్గాల్లో సేవలు అందిస్తుండగా.. తాజాగా మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్ - నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది.  ఈ నెల 16న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానం లో ఈ రైలును ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ నుంచి మొదలయ్యే ఈ రైలుకు అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలుకుతారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 10 వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతుండగా తెలుగు రాష్ట్రాల్లో నాగ్‌పూర్ విశాఖ  ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మధ్య తిరుగనున్నాయి.