calender_icon.png 29 March, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగ్‌పూర్ అల్లర్ల కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత

25-03-2025 12:00:00 AM

నాగ్‌పూర్, మార్చి 24: నాగ్‌పూర్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన ఫాహిమ్ ఖాన్ అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అతడి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలిచ్చింది. సోమవారం బుల్డోజర్లతో రంగంలోకి దిగిన ఎన్‌ఎంసీ అధికారులు కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు.

ఫాహిమ్ ఖాన్ నివాసం సహా ఇతర అక్రమ నిర్మాణాలను కూల్చే శా రు. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని..  నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతోనే కూల్చేసినట్టు వెల్లడించారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఫాహిమ్ ఖాన్ సామా జిక మాధ్యమం ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి నాగ్‌పూర్ అల్లర్లకు ప్రధాన కారణమయ్యాడన్న కారణంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఫాహిమ్ సహా ఆరుగురిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. శంభాజీనగర్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ డిమాండ్ చేయడం ఘర్షణలకు దారి తీసింది. ఈ నేపథ్య ంలో మార్చి 17న నాగ్‌పూర్‌లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇప్పటివరకు ఈ కేసులో 50 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు.