calender_icon.png 23 October, 2024 | 7:02 PM

నాగిరెడ్డిపేట తహసిల్దార్ సస్పెన్షన్

29-08-2024 03:12:26 PM

ఉత్తర్వులను జారీ చేసిన కలెక్టర్

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తాసిల్దార్ లక్ష్మణ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆశిస్తాన్వాన్ సస్పెండ్ గురువారం సస్పెండ్ చేశారు. తాసిల్దార్ లక్ష్మణ్ పై అవినీతి ఆరోపణలతో పాటు మధ్యవర్తులను నియమించి వసూళ్లకు పాల్పడుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు రావడంతో ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ప్రభాకర్ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన తాసిల్దార్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి కలెక్టర్ ను నివేదిక సమర్పించారు. తాసిల్దార్ లక్ష్మణ్  సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.