calender_icon.png 26 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా మమ్మల్ని ఆడించిన చిన్నపిల్లాడే నాగీ

17-07-2024 02:42:14 AM

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి2898ఏడీ’. గత నెలలో విడు దలైన ఈ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు రాబ ట్టింది. ఈ సందర్భంగా చిత్రబృం దం తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో సుప్రీ మ్ యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ తాజాగా మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన ‘కల్కి తన పాత్ర అదిరిపోతుందని చెప్పారు. “కల్కి’ హిట్ టాక్ వచ్చినప్పట్నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. కలెక్షన్లు పెరుగుతుండ మూ నాకు సంతోషాన్నిస్తోంది.

నా కెరీర్‌లో 250 ఆర్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటా.. ఒకట్రెండు సినిమాల విషయంలో నేను కాస్త బద్దకించి ఉండొచ్చు. అన్ని సినిమాలూ అంద రి దృష్టినీ ఆకర్షించకపోవచ్చు. ఈ చిత్రానికి మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయమిది” అని చెప్పారు కమల్. ఇంకా యాస్కిన్ పాత్ర గురించి చెప్తూ.. “కల్కి’లో యాస్కిన్ పాత్రను ఎలా చూపించాలో మాకు తెలియలేదు. చాలా కసరత్తు జరిగింది. ఆ పాత్రను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం.

ఆ గెటప్ చూసిన వెంటనే నాకే ఇబ్బందిగా అనిపించింది.. చాలా ఉత్సాహమూ కలిగింది. చాలా డిజైన్లు చేశాం. మేకప్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లాం. ఇదంతా ఒక్క పాత్ర కోసమే. సినిమా మొత్తం కలిపితే గట్టిగా పది పాత్రలైతే ఉంటాయేమో! పార్ట్ యాస్కిన్ పాత్ర ఇంకా ఎక్కువగా ఉంటుంది” అని వివరించారు. ఇంకా “ఇండియన్ బిగ్‌స్టార్స్ ఇందులో కలిసి నటించారు. అసలు ఈ మూవీ ఆలోచనే ఒక ఆటలాంటిది. మనం చిన్నప్పుడు పిల్లలతో కలిసి బొమ్మలాట ఆడుతుండేవాళ్లం.

‘ఇదిగో నీ కోసం ఇది వండాను.. తిను’ అంటే అక్కడ ఏమీ లేకపోయినా, మనం ఆ ఆటలో భాగమై తిన్నట్టు నటిస్తాం. ఈ మూవీ కూడా అలాంటిదే. ప్రేక్షకులను అలా మాయ చేస్తుంది. అలా ఆడించిన చిన్నపిల్లాడే నాగీ. ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావు ఇలాగే ఉండేవారు. నేనెప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదు.. మాట్లాడలేదు. సినిమాలను, పాత్రలనే ఆస్వాదిస్తా. ‘కల్కి’ చిత్రం చూసి మీరు సంతోషపడితే మేము మరింత సంతోషిస్తాం” అని కమల్‌హాసన్ అన్నారు.