14-02-2025 12:39:29 AM
రాజేంద్రనగర్, విజయక్రాంతి ఫిబ్రవరి 13: అత్తాపూర్ ఇన్స్పెక్టర్ గా నాగేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన వెంకటరామిరెడ్డి బదిలీపై హెచ్‌ఎండిఏ కు వెళ్లారు. ఆయన స్థానంలో ఆర్ జిఐఏ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్న నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నారు.
బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగేశ్వరరావు రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.