29-04-2025 01:32:56 AM
పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: న్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ గ్రహీ తలకు అవార్డులు ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, మరణానంతరం పద్మ అవార్డు పొందిన మిరియాల అప్పారావు (ఆయన తరఫున ఆయన కూతురు బుర్రకథ కళాకారిణి శ్రీదేవి) అవార్డులు స్వీకరించారు.
నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డు రాగా, కళా రంగంలో నాగఫణి శర్మ, మిరియాల అప్పారావుకు పద్మశ్రీలు వరించా యి. 139 మందికి జనవరి 26న పద్మ అవార్డులను ప్రకటించగా.. సోమవారం కొంత మందికి అవార్డులు ప్రదానం చేశారు.